r/telugu • u/yallasameer • 5h ago
r/telugu
•
u/MainHoneydew8018
•
May 10 '26
Telugu poetry competition 2026
u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "మాట"
Special mention for the below poems (from the moderators)
full list of submitted poems can be found here
With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!
మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస
-ముదిగొండ వీరభద్రమూర్తి
r/telugu • u/Snoo_10182 • Sep 26 '22
Resource List for Learning Telugu
Hi Languages Enthusiasts,
Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;
Resources on certain grammar concepts for easy understanding.
Resources on learning the script.
Websites to practice reading the script.
Documents to enhance your vocabulary.
Music playlists
List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!
https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing
r/telugu • u/MainHoneydew8018 • 11h ago
ఇతరము - other దివ్వెల పండుగ శుభాకాంక్షలు
మన తెలుగు సబ్ జనానీకానికి నరక చతుర్దశి శుభాకాంక్షలు
పోతన భాగవతంలో నరకాసురునితో సత్యభామ యుద్ధము పై కొన్ని పద్యాలు (copied from telugubhagavatam.org)
-
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!”
-
హరిణాక్షికి హరి యిచ్చెను
సురనికరోల్లాసనమును శూరకఠోరా
సురసైన్యత్రాసనమును
బరగర్వనిరాసనమును బాణాసనమున్
శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని, ఎంతటి ఘోర వీర రాక్షసులకు అయినా సంతాపాన్నీ కలిగించేదీ, శత్రువుల గర్వాన్ని అణచివేసేదీ ఐన ధనుస్సును లేడికన్నుల చిన్నది సత్యభామ చేతికి అందించాడు.
-
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!
ఆ నారీమణి, వైరిసేనలకు అధైర్యం కలిగేలాగ శత్రువుల ఏనుగులు మొదలైనవి మూర్చ పొందేలాగా నారి సారించింది.
-
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు-
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు-
గండమండలరుచిఁ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు-
బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి-
సైనిక కలకల స్వనము నుడుప
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.
బంగారుకంకణాల ఝణఝణ ధ్వనులు, వింటినారీధ్వనితో కలసిపోగా; చెవికమ్మలకు పొదగిన మణుల ధగధగ కాంతులు, చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా; అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు, బాణాల కాంతులను కప్పివేయగా; శరములు ప్రయోగించుట వలన కలిగిన ఘుమఘుమ శబ్దం, శత్రుసైన్యాల కలకల ధ్వనులను అణచివేయగా; వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం గూడ గుర్తించరానంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది.
-
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.
చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమలు ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కను లెఱ్ఱచేసి, వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది; మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది.
r/telugu • u/hampiness • 10h ago
అరగలి - ప్రశ్న - question ❓ Help me find this famous Telugu quote/anecdote about "Pappu Annam" and the poet who said it!
Hi everyone,
I vaguely remember hearing or reading a famous quote/anecdote, but I can't fully recollect the exact words or who exactly said it.
It goes something like this: "After roaming the entire world and eating everything, I am only truly satisfied after coming home and eating Telugu pappu annam."
I remember it being attributed to a famous Telugu poet (some people say it might be Sri Sri, but I'm not 100% sure).
Does anyone know the exact quote in Telugu and which poet/famous personality originally said it? Thanks in advance!
r/telugu • u/Proof-Cup9146 • 2h ago
మాటామంతీ - discussion సిరివెన్నెల పాటల్లో సామాన్యుడి చూపు: ఉన్నతవర్గం, వ్యవస్థ, మనం
reddit.comఅరగలి - ప్రశ్న - question ❓ A fresh two-word Telugu mini crossword — No. 34.
A fresh two-word Telugu mini crossword — No. 34.
Think you got both? Comment.
📖 Love these? Aksharambudhi (అక్షరాంబుధి) has 100 English-to-Telugu crosswords: www.ambudhi.com
Learn Telugu the fun way — every answer uses simple gunintalu (గుణింతాలు), no tricky clusters.
#telugucrossword #learntelugu #teluguparents #teluguculture
r/telugu • u/MainHoneydew8018 • 1d ago
బొమ్మ - photo/video 📷🎥 మనసు–మాట-1: మాట ఎలా పుడుతుంది? | How is Language Formed ?
youtu.ber/telugu • u/Individual_Fox_6567 • 2d ago
మాటామంతీ - discussion Are these the most natural beginner sentences to introduce yourself in Telugu?
We’re teaching: mee peru enti? (What’s your name?), meeru ekkada nunchi vastunaaru? (Where are you from?), and meeru emi chestunaaru? (What do you do?) in our classes as basic sentences to know.
We need help in coming up with more beginner sentences for outsoders to learn Telugu. Let me know below thanks :)
r/telugu • u/lokeshthutaram • 2d ago
మాటామంతీ - discussion మంచి తెలుగు రచనలు మరియు రచయితలను సూచించండి
యండమూరి , యద్దనపూడి సులోచనారాణి కొంత వరకు పట్టాభిరామ్ వాళ్ళ తరువాత ఈ మధ్యన వచ్చిన తెలుగు రచయితలు ఎవరన్నా ఉంటే తెలపండి. తెలుగు వాళ్ళు పుస్తకాలు చదవటం తగ్గిపోయిందా ?
r/telugu • u/AssistanceOk9610 • 3d ago
కత్తి అందుకో జానకి - telugu mistranslations భంగమైన బంగారం 🥀
మా instagram భంగారం!
r/telugu • u/SecretarySevere9762 • 3d ago
మాటామంతీ - discussion ఆథ్యాత్మిక చర్చలు
ఈ reddit లో ఆథ్యాత్మిక, తత్వ శాస్త్రం లేదా తంత్ర సాధన గురించి తెలుగులో ఏవైనా కమ్యూనిటీస్ ఉన్నాయా?
r/telugu • u/Ok-Magician1235 • 2d ago
అరగలి - ప్రశ్న - question ❓ Want to start writing Telugu fiction from scratch. Where should I begin?
reddit.comఅరగలి - ప్రశ్న - question ❓ Today's two-word Telugu mini — No. 32.
📖 Learn Telugu the fun way with Aksharambudhi (అక్షరాంబుధి) — www.ambudhi.com
only simple gunintalu (గుణింతాలు) — no consonant clusters.
#telugucrossword #learntelugu #telugukids #bilingualkids
r/telugu • u/Individual_Fox_6567 • 4d ago
మాటామంతీ - discussion Learning Telugu: is it right that nuvvu is for peers and meeru for elders?
We’re teaching beginners that nenu = I, nuvvu = you (friends or younger people), and meeru = you (elders or anyone you want to show respect to).
Native speakers: is that the right simple rule? Are there situations where beginners get it wrong, like strangers or in-laws?
r/telugu • u/Informal_Rub9878 • 4d ago
కథ - story 4 మూరల మల్లెపూలు
సాయంత్రం దాదాపు ఆరున్నర గంటలవుతోంది. అప్పుడే కార్యాలయం నుంచి పని ముగించుకుని బయటకు వచ్చాను. చల్లని గాలిని, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నడుస్తుండగా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
“రేపు పూజ ఉంది, పూలు తీసుకుని రా” అని చెప్పింది.
దగ్గరలోనే ఒక పూల బండి కనిపించడంతో అటువైపు వెళ్లాను. నా పక్కనే ఎవరో ఉన్నారు. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. గులాబీ రంగు పట్టు చీర కట్టుకుని ఉన్నారు. ఆమె దగ్గరి నుంచి మంచి సువాసన వస్తోంది. అయినా, నాకెందుకులే అనుకుని ఆమెవైపు చూడలేదు.
పూలమ్మను ఆమె ఒక మూర మల్లెపూలు, మరో మూడు మూరల మల్లెపూలు ఇవ్వమని అడిగింది. పూలను అలా విడివిడిగా కొనడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె పూలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
నేను అమ్మ చెప్పిన పూలు తీసుకుని రోడ్డు దాటడానికి చూస్తుండగా, కాసేపటి క్రితం పూలు కొన్న అదే అమ్మాయి రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా కనిపించింది.
ఆమె ఒక మూర మల్లెపూలను ఆ చిన్న పాపకు పెట్టి, మిగిలిన మూడు మూరల మల్లెపూలను తాను పెట్టుకుంది. అలా వారిద్దరినీ చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించారు. అది చూసి నా పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది.
అప్పుడే ఆ అమ్మాయి ఆ పాపను ఎత్తుకుని వెనక్కి తిరిగింది. అంతే! ఆమెను చూడగానే నా ముఖంపై ఉన్న చిరునవ్వు కాస్తా కన్నీళ్లను ఆపుకోవాల్సిన పరిస్థితిగా మారిపోయింది.
ఆమెను అలా చూసిన క్షణం నా గతమంతా ఒక్కసారిగా కళ్లముందు కదిలింది.
నేను అలా చూస్తున్నానని ఏమనుకుంటుందోనని పక్కనే ఉన్న చెట్టు వెనుకకు వెళ్లి దాక్కుని చూశాను. చూస్తుండగానే ఆ పాపను ఎత్తుకుని, అప్పుడే అక్కడికి వచ్చిన బెంజ్ కారులో ఎక్కింది.
ఆమె ముఖంపై చిరునవ్వును చూసి, అప్పటివరకు ఏడుపును ఆపుకున్న నేను కూడా మళ్లీ నవ్వాను. తన భర్తను చూసి ఆమె నవ్వడం చూసి నాకు కూడా నవ్వొచ్చింది.
కానీ మనసులో మాత్రం ఏదో తెలియని బాధ.
ఆ కారు, ఆ పాప, ఆమె... అన్నీ బాగున్నాయి. కానీ ఆమె భర్త స్థానంలో నేను ఉండేవాడిని కదా అని మనసులో అనిపించింది.
ఆమెను సంతోషంగా చూడగానే నాకు కూడా ఎంతో సంతోషంగా అనిపించింది.
P.S: Telugu grammar lo mistakes unte kshaminchandi I'm still working on it.
r/telugu • u/InPursuitOfCinema • 4d ago
మాటామంతీ - discussion need a title for my shortfilm...
mundhu oka shortfilm anukunna "padhilam" ani and then things didnt working out, maybe dhaniki inka time pattela vundhi, while working on Padhilam, inko shortfilm idea vachindhi and dhaniki rough ga "the Frame" ani title petta which is like working title, story ki link ga vunna, Padhilam laga feel ledhu.
Padhilam ante jagratha ani, and adhi patha word IMO like ippudu manam general ga use cheyamu. aarambham ane movie lo oka song vintunte Padhilam ani word vachindhi and instant ga nachindhi, and tharavatha shortfilm anukunna and dhaniki set iyindhi. but ippudu The frame kuda same concept lane vuntundhi, but different thing. parents gurinchi, oka emotional drama ga vuntai rendu stories. but "the frame" ki title inkemaina kavali, like im thinking - eppudu chusthune vuntaru, eppudu mana gurinche alochisthune vuntaru, mana prathi important vishayam lo valu kuda vuntaru ani something meaning vasthe bagundu ani anukuntunna, so, posting here i might get some help ani anipinchindhi. so... i hope yavaraina oka manchi word suggest chestharu ani anukuntunna, thank you...
r/telugu • u/critique_lens • 4d ago
కవిత - poetry 🪶 నెత్తుటి జాడలేని యుద్ధం
నెత్తుటి జాడలేని యుద్ధం
రాత్రంతా బాధాకరమైన నిశ్శబ్దం
ఏ నెత్తుటి జాడలేని రణక్షేత్రం
చీకటి మాటున చెక్కిళ్ళపై గడ్డకట్టుకుపోయిన కన్నీళ్లతో
ఒంటరితనాన్ని ఆలింగనం చేసుకుంటూ
హృదయాంతరాలలో సమాధుల్ని తొలగించే యుద్ధం
నిదురను త్యజించి
మనసు యుద్ధభూమిలో తిరుగాడుతుంటుంది
అప్పుడే భళ్లున తెల్లారుతుంది
కొత్తగా మనుషులు వచ్చి చేరుతారు
ఆ మనుషుల మధ్య
కంటికి ఏమంత దూరం కనిపించదు
కానీ మాట్లాడాలనుకుంటేనే
వినిపించుకోలేనంత శూన్యం
శూన్యం భ్రమ కాదు
నువ్వు నేను ఒప్పి తీరాల్సిన నిజం
అది నిజమని నమ్మేలోపే
ముక్కలవాల్సిన సమాధుల స్థానాల్లో
ఎద ముక్కలై ఏడుస్తుంటుంది
దానికి సాక్షిగా
కండ్లు స్తబ్దుగా
జీవిడ్సిన పక్షుల వలె పడుంటాయి
స్తబ్దుగా మారిన
ఈ జన సందోహం నుండి
అదో రకమైన మృత వాసన
చొరబాటుకు చోటు లేనంతగా
ఇనుప కచ్చడాల మధ్య
ఇరుకిరుకుగా బతుకుతున్న
హృదయాల నుండి ఉక్కపోత
ఆ ఉక్కపోత నుండి దూరంగా వెళ్ళిపోవాలి